Scrolling Text with Link
శ్రీ అభినవ విద్యా తీర్థ సదనం భవన నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. యధాశక్తి విరాళాలు ఇచ్చి భవన నిర్మాణానికి తోడ్పాటు అందించగలరు.తమ యొక్క విరాళాలు ఫోన్ పే/గూగుల్ పే నం. 9347482602 కు పంపగలరు.- కార్యవర్గం, శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం, వేములవాడ.

ముందుమాట

రాజేశ్వరీరాజితదివ్యగేహం రాజేశ్వరంపాలితభక్తలోకం
శ్రీధర్మకుండాన్వితతీర్థరూపం శ్రీవిష్ణుమిత్రంశిరసానమామి
!

గజతురగ సహస్ర గోకులం భూమిదానం కనక రజత పాత్రం మేదినీ సాగరాంతం :
ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రధానం నభవతు సమతుల్యం అన్నదానస్సమాన :

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే మన బ్రాహ్మణ భక్తుల కోసం 1988 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నసత్రాన్ని ప్రారంభించడం జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించి 128 అనువంశిక అర్చక కుటుంబాల ఘర్పట్టి ఒక లక్ష 25 వేల రూపాయల మూలనిధితో ప్రారంభించిన నిత్యాన్న సత్రం అంచెలంచెలుగా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుండి అద్దె భవనంలో కొనసాగుతున్న మన సత్రం దాదాపు 20 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ నమిలకొండ కోటయ్య గారి కృషితో, శ్రీ శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో శంకరమఠం వెనుక భాగంలో మన సత్రం నిర్విరామంగా కొనసాగుతుంది.ఇప్పటివరకు శ్రీ స్వామివారి కరుణాకటాక్షాలతో లక్షలాదిమంది భక్తులు అన్నదాన యజ్ఞంలో పాల్గొన్నారు. కేవలం అన్నదానమే కాకుండా వివిధ ప్రాంతాల్లోని బ్రాహ్మణులకు అన్నదానం చేసినాము. వివిధ ప్రాంతాల్లో ఉన్న మనవారి కోసం, వేములవాడ బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించు కున్నారు. నామకరణం, కేశఖండనం, ఉపనయనం, ,వివాహాది శుభకార్యాలు , జన్మదిన & వివాహాది వార్షికోత్సవాలు మరియు వివిధ సంప్రదాయక కార్యక్రమాలు మన సత్రంలో చేసుకుంటూ సహాయ, సహకారాలు అందిస్తున్నారు.ఇకముందు కూడా మీ అందరి సహాయ సహకారాలతో మన సత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని, రాబోయే రోజుల్లో బ్రాహ్మణ భక్తులకు సేవ చేస్తామని ఆకాంక్షిస్తూ…..

వేములవాడ ఆనువంశిక అర్చక ట్రస్ట్

శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ సేవా సంఘం

Lalitha & Gayathri Maha Japam

“This collective Lalitha and Gayathri Japam is being performed with a sacred intention for global peace, harmony, and well-being. Devotees from different places are joining together in prayer, chanting the divine mantras and contributing their japam counts as an offering for the welfare of the world.” 🕉️

🕉 Koti Lalitha Japam Count 🕉

Loading…

🕉 Koti Gayathri Japam Count 🕉

Loading…

Sri Abhinava Vidya Tirtha Sadanam

Management

The project is initiated and managed by the Brahmin Seva Sangham and the hereditary trustee board of the Sri Raja Rajeshwara Brahmana Nityanna Satram.

Facilities

The building plan includes a large hall and sixteen individual accommodation rooms.

Trust Legacy

The parent organization, Sri Raja Rajeshwara Brahmana Nityanna Satram, has been serving pilgrims for over 31 years.

Services